రోషన్‌, అనూష జంటగా నటిస్తున్న చిత్రం ‘నువ్వెందుకు నచ్చావె శైలజ’. నాగేశ్వరరావు దర్శకుడు. వి.రామకృష్ణ నిర్మాత. సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సి.కల్యాణ్‌ క్లాప్‌నిచ్చారు. కొమర వెంకటేష్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. కృష్ణమోహన్‌ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ  ‘‘ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించకూడదు? అసలు ప్రేమకుండాల్సిన అర్హతలేంటి? అనే విషయాల్ని స్పృశిస్తూ సాగే చిత్రమిది. ప్రస్తుత సమాజ పరిస్థితులకు అద్దం పడుతుంద’’న్నారు. ‘‘నాలుగు పాత్రల మధ్య నడిచే కథ ఇది. యువతరానికి కావల్సిన అన్ని అంశాలూ ఉంటాయ’’న్నారు నిర్మాత. సంగీతం: సాయి కార్తిక్‌.