
ఆ మధ్యలో మండే అగ్నిగోళాల్లా ఇద్దరు పెద్దలు...
ఒకరు నరసింహ - మరొకరు దేవరాజ్. ఇద్దరి మధ్య వైరం నీటిలో కూడా మంటలు పుట్టిస్తుంది. šపెను విధ్వంసాలను సృష్టిస్తుంది. నరసింహను చూస్తే ఊళ్లో ఒక వర్గమంతా తలవంచి నమస్కరిస్తారు. మరో వర్గం ఎప్పుడు తలలు తెగనరుకుతాడా అని భయంతో వణుకుతారు. కానీ ఆ నరసింహ మనసు మాత్రం ఎప్పుడూ తన ఇద్దరు కూతుళ్లమీదే. వాళ్లే... లహరి, అక్షర! నగరంలో చదువుకుని వచ్చిన అందమైన అమ్మాయిలు. ఒకరికి పట్టుదల ఎక్కువ, మరొకరికి ప్రేమాభిమానాలు ఎక్కువ.
చిరుగాలిలో చల్లగా సాగే తెరచాప పడవలాంటి వాళ్ల జీవితం అకస్మాత్తుగా ఓ పెను తుపానులో చిక్కుకుంది. నివ్వెరపోయి తేరుకునేలోగానే ఆ అక్కాచెల్లెళ్ల దారులు వేరువేరయ్యాయి.
విధి శాసించిన వింత కథలో నాన్న అనురాగాన్ని మరచిపోలేక, జరిగిన విషాదాన్ని దిగమింగు కోలేక ఆ ఆడపిల్లలు ఇద్దరూ ఏం చేశారు? ఎలా అడుగు ముందుకు వేశారు?
అనుక్షణం ఉత్కంఠతో సాగే ధారావాహిక ‘లాహిరి లాహిరి లాహిరిలో...’.
ఈ రోజు నుంచి ఈటీవీలో రోజూ రాత్రి 7 గంటలకి ప్రసారం కాబోతోంది.
* ఓడలు, షిప్‌యార్డులు, పడవ పందేలు, భారీగా సాగే చేపల వ్యాపారాలు...వీటి నేపథ్యంలో ప్రేమ, ఆప్యాయత, కుటుంబ బంధాలను హృద్యంగా చూపే ‘లాహిరి లాహిరి లాహిరిలో..’ ధారావాహికను ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ‘ఆర్కా మీడియా’ ఈటీవీ కోసం నిర్మిస్తోంది.
* ప్రముఖ నటుడు ఆనంద్ తొలిసారి తెలుగు టీవీలో, అందులోనూ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.
* మరో ముఖ్యపాత్రలో నిళగల్ రవి, హీరోయిన్లుగా అత్యంత ఆకర్షణీయమైన పాత్రల్లో శోభాశెట్టి, సంజన నటిస్తున్నారు.
* యువతరాన్ని, మహిళా లోకాన్ని అమితంగా ఆకట్టుకునే ఈ ధారావాహిక గురించి విశేషాలు నటీనటుల మాటల్లోనే...
* ప్రముఖ నటుడు ఆనంద్ తొలిసారి తెలుగు టీవీలో, అందులోనూ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.
* మరో ముఖ్యపాత్రలో నిళగల్ రవి, హీరోయిన్లుగా అత్యంత ఆకర్షణీయమైన పాత్రల్లో శోభాశెట్టి, సంజన నటిస్తున్నారు.
* యువతరాన్ని, మహిళా లోకాన్ని అమితంగా ఆకట్టుకునే ఈ ధారావాహిక గురించి విశేషాలు నటీనటుల మాటల్లోనే...
‘‘తమిళంలో రెండు ధారావాహికలు చేశా. తెలుగు నుంచీ ఎప్పట్నుంచో అవకాశాలు వస్తున్నాయి. కానీ నేనే ఒప్పుకోలేదు. మేకింగ్ ఆలస్యమవుతుందనీ... కథలు ఎలా ఉంటాయో అని అటువైపు ఆసక్తి చూపించలేదు. అయితే ఆర్కా మీడియా నుంచి ‘లాహిరి లాహిరి లాహిరిలో...’ అవకాశం రాగానే మొదట కథ విందామనుకొన్నా. విన్నాక అచ్చం ఇదొక సినిమా కథలాగే అనిపించింది. ఆర్కా మీడియా ఈ ధారావాహికని తీయాలనుకొంటున్న విధానం, కథని మలిచిన తీరు నాకు నచ్చడంతో వెంటనే ఒప్పుకొన్నా. ఒక సినిమాలాగే తీస్తున్నారు. రోజూ 150 నుంచి 250 మందికిపైగా నటులు, సాంకేతిక బృందం సెట్‌లో ఉంటారు. అంత భారీగా తీస్తున్న ధారావాహిక ఇది. సినిమాలో నటిస్తున్నట్టే ఉంది’’. * ‘‘తన ఇద్దరు కూతుళ్ల కోసం ప్రాణాలిచ్చేంత ప్రేమ ఉన్న తండ్రి పాత్ర నాది. అతనికి ప్రేమ ఎంతో, కోపం కూడా అంతే. ముక్కుసూటి మనిషి. ఆ వ్యక్తిత్వం తన కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపించింది? అతని శత్రువులు ఎవరు? ఏం చేశారనేది ఆసక్తికరం. నటనకి అవకాశమున్న ఓ మంచి పాత్ర ఇది. అప్పుడప్పుడు నా పాత్రలో ప్రతినాయక ఛాయలు కూడా కనిపిస్తుంటాయి. మామూలుగా ధారావాహికలనగానే ఇంట్లో కుటుంబ ప్రేక్షకులు మాత్రమే చూస్తారనుకుంటాం. కానీ దీన్ని యువతరం కూడా ఇష్టపడుతుంది. బంధాలు, అనుబంధాలు, పగ, ప్రతీకారంతోపాటు... మంచి ప్రేమకథ కూడా ఉంటుంది. మంచి డ్రామా పండింది’’. * ‘‘మంచి కథల్నికానీ... నటీనటుల్ని కానీ ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువ చేసే శక్తి సామర్థ్యాలు టెలివిజన్‌కి ఉన్నాయి. ఒకేసారి కొన్ని కోట్ల మంది టీవీని చూస్తుంటారు. నేరుగా ప్రేక్షకుల ఇళ్లలోకి వెళతాం. చాలాసార్లు చూస్తుంటాను కదా... ఎంత పెద్ద నటులైనా, పారితోషికం ఎంత తీసుకొంటున్నా, పక్కన టీవీ నటులు ఉన్నారంటే ప్రేక్షకులు వాళ్లనే బాగా గుర్తుపడతారు. అంత బలం టీవీకి ఉంటుంది. అందుకే టెలివిజన్ అంటే ఇష్టం. ‘లాహిరి లాహిరి లాహిరిలో..’తో తెలుగు ప్రేక్షకుల ఇళ్లల్లోకి, వారి మనసుల్లోకి నేరుగా వెళుతున్నందుకు ఆనందంగా ఉంది’’. * ‘‘తొలి సినిమాకి నా పారితోషికం రూ.2 వేలు. ఆ మొత్తం క్రమంగా రూ.20 లక్షల వరకు వెళ్లింది. 33 ఏళ్లుగా నటుడిగా నా ప్రయాణం కొనసాగుతోంది. ప్రతి రంగంలోనూ ఆటుపోట్లు ఉన్నట్టుగానే ఇందులోనూ ఉంటాయి. కథానాయకుడిగా నట ప్రయాణాన్ని ఎంతగా ఆస్వాదించానో, సహాయ నటుడిగా ఇప్పుడూ అంతే సంతృప్తితో ఉన్నా. ‘సైరా నరసింహారెడ్డి’, ‘డియర్ కామ్రేడ్’తో పాటు అల్లు శిరీష్ సినిమా, ‘సవ్యసాచి’ల్లోనూ నటిస్తున్నా’’. |
‘‘నిజ జీవితాల్లో అమ్మాయిలకి నాన్నతో ఎక్కువ అనుబంధం ఉంటుంది. నేను నాన్న కూతురిని అని చెప్పుకొంటుంటారు. ఇందులో లహరి అలాంటి అమ్మాయే. వంద మంది ఎదురుగా వచ్చినా ధైర్యంగా సమాధానం చెబుతుంది. ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తుంది. అదంతా నాన్నని చూసే. అలాంటి లహరి జీవితంలో ఎన్ని ఆటుపోట్లని ఎదుర్కొందన్నది ఆసక్తికరం. తండ్రీ కూతుళ్ల అనుబంధంతో పాటు... మన జీవితాల్లోని పలు కోణాల్ని స్పృశించే కథ ఇది. ఈ కథ, పాత్రలు వినగానే తప్పనిసరిగా నటించాల్సిన ధారా వాహిక అనిపించింది. ‘అత్తారింటికి దారేది’తో పాటు, తెలుగులో మరో ధారావాహిక కూడా చేశా. ఇది వాటికి భిన్నంగా సాగుతుంది’’.
![]()
* ‘‘ధారావాహిక అనగానే కుటుంబమే గుర్తుకొస్తుంది. మన జీవితాల్లో ఏం జరుగుతుందో అదే చూపిస్తుంటారు. టీవీతో మేం కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాం. ‘లాహిరి లాహిరి లాహిరిలో...’ తరహా ధారావాహికలతో కుటుంబంలో ఒకరిగా మారిపోతామనే నమ్మకముంది. ఇందులో నా పాత్ర కంటతడి పెట్టిస్తుంది. మన చుట్టూ జీవితాల్ని ప్రతిబింబించే కథ కాబట్టి మరింత లీనమై నటించా. దర్శకుడు జై వల్లే తెలుగు భాషని చాలా వేగంగా నేర్చుకొన్నా. ఇప్పటికే ముప్పై రోజులు చిత్రీకరణలో పాల్గొన్నా. ముప్పయ్యేళ్ల అనుభవం వచ్చినంత అనుభూతి కలిగింది’’.
|


0 Comments